Sunday, 8 November 2026

నల్లగాసు గీత మృతి బాధాకరం దేవరకొండ ఎమ్మెల్యే,

నల్లగాసు గీత మృతి బాధాకరం దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్
కొండమల్లేపల్లి డిసెంబర్ 22 జనంసాక్షి న్యూస్:
కొండమల్లెపల్లి మండల కేంద్రానికి చెందిన నల్లగాసు గీత (26) మృతి బాధాకరం అని దేవరకొండ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం గీత మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం నల్లగాసు గీత భర్త శ్రీను మరియు కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఆయన వెంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్,బిఆర్ఎస్ జిల్లా నాయకులు అబ్బానబోయిన శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఎలిమినేటి సాయి,ఉప సర్పంచ్ గంధం సురేష్,బోడ్డుపల్లి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.