ఘనంగా కార్తీక మాస పూజా మహోత్సవాలు హుజూర్ నగర్ నవంబర్ 18 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో శ్రీ సంతాన సోమలింగేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా గత 25 రోజులుగా మహాన్యాస రుద్రాభిషేకాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయన్నారు. వేద పండితులు శ్రీ ఫాల్గుణ అయ్యవారి మంత్రోచరణలతో శ్రీరంగబట్టాచార్యులు, కొండయ్య, సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, సోమ గాని నరసింహారావు, మల్లికార్జున, తిరుపా రెడ్డి, అనిల్, కోటయ్య, గుండా రామ్ రెడ్డి, కంచర్ల మధుసూదన్ రెడ్డి, కన్నె గుండ్ల సీతారాములు మొదలైన వారు ప్రతి రోజు శ్రీ సంతాన సోమలింగేశ్వర స్వామి మహాన్యాస రుద్రాభిషేకములలో పాల్గొంటున్నారని తెలిపారు
ఘనంగా కార్తీక మాస పూజా మహోత్సవాలు




