Thursday, 5 November 2026

తమ భూమిని సర్పంచ్ కుమారుడు కబ్జా చేశాడు

తమ భూమిని సర్పంచ్ కుమారుడు కబ్జా చేశాడు *రక్షణ కల్పించాలని మహిళ ఆవేదన తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 17:: తమ పేరును పట్టా ఉన్న భూమిలో గ్రామానికి చెందిన సర్పంచ్ కుమారుడు అక్రమంగా ప్రవేశించి చంపుతానని బెదిరిస్తున్నాడని కోర్టు ఆర్డరు పట్టా పాస్ పుస్తకం ఉన్నప్పటికీ భూమిలోకి రానివ్వడం లేదంటూ లింగ రెడ్డి పేట గ్రామానికి చెందిన బావని మాధవి మహేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు మనోహరాబాద్ మండలం లింగ రెడ్డి పేట గ్రామానికి చెందిన భామని మల్లయ్యకు నలుగురు కూతుళ్లు గౌరీ పద్మ నిమ్మల మంజుల మానుక లావణ్య బావని మాధవి నలుగురు కూతుళ్లు ఉండగా గౌడి పద్మ నిమ్మల మంజుల మానుక లావణ్య పేరుతో తమ తండ్రి సర్వే నెంబరు 23 ఆ లో 16 గుంటలు భూమిని ముగ్గురు అక్కలకు పట్టా చేసి ఇచ్చారని చిన్న కూతురు బావని మాధవి తెలిపారు తాను తన తండ్రి ఇల్లరికం చేసి లింగారెడ్డిపేటలోని ఉంటున్నానని తెలిపారు తండ్రి చనిపోవడంతో తమ అక్కల కు చెందిన భూమిని గ్రామానికి చెందిన కొందరు కౌలు పేరుతో కబ్జాలో ఉన్నారు దీనిని అదునుగా చేసుకున్న సర్పంచ్ కుమారుడు పెంటా గౌడ్ ముగ్గురు అక్కల భూమిలో భూమిని 55వేలకు గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రిజిస్ట్రేషన్ సమయంలో కబ్జాదారుల నుండి నేను కబ్జా చేసుకుంటానని దానికి మీకు సంబంధం లేదంటూ మార్కెట్ రేటు కన్నా అతి తక్కువ ధరకు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మాధవి తెలిపింది అయితే వారి భూమిని వదిలి తన పేరున ఉన్న 23 సర్వేనెంబర్ ఈ లో 14 గుంటలు భూమిని కబ్జా చేసుకుని తమను రానివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పసుపు కు తమ పేరున ఉన్న గ్రామ సర్పంచ్ మరియు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో గ్రామస్తుల సహకారంతో తమను భూములకు రానివ్వడం లేదని ఈ విషయంపై మనోహరాబాద్ పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన సహాయం చేయడం లేదని ఆమె బోరను వినిపించారు చివరికి గత్యంతరం లేక కోర్టు ఆర్డర్ సైతం తెచ్చుకున్న పోలీసులు రక్షణ కల్పించడం లేదని కోర్టు ఆర్డర్ తెచ్చామంటూ చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడని పెంటా గౌడ్ నుండి తమకు ప్రాణహాని ఉందని భయంతో బతుకుతున్నామని ఆమె తెలిపారు తమను బెదిరిస్తూ తమ పొలంలో పంట వేసి రాత్రి వేళల్లో పంట తీసుకున్నాడని ఈ విషయం పోలీసులను ఆశ్రయించగా తామేమి చేయలేమంటూ చెప్పారని ఆమె తెలిపారు తన పేరున ఉన్న పట్టా భూమికి రక్షణ కల్పిస్తూ పెంటా గౌడ్ నుండి ప్రాణహాని ఉందని చంపేస్తానంటూ తన భర్త మహేష్ ను తనను బెదిరిస్తున్నాడని తమ భూమి లోకి రాకుండా చేయాలని ఆమె పోలీసులను రెవిన్యూ అధికారులను కోరారు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో తమకు దక్షిణ లేదని ఆమె తెలిపారు