Wednesday, 4 November 2026

ఘనంగా కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి

ఘనంగా కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి.ఘనంగా కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి.
– మండల కేంద్రం లో బీసీ సంఘం ఆధ్వర్యంలో…
– శ్రీకాంతా చారి త్యాగం మరువలేదని.
బూర్గంపహాడ్ డిసెంబర్ 03 (జనంసాక్షి)తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి కార్యక్రమాన్ని భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రం లో బీసీ సంఘం మండల అధ్యక్షులు దాసరి సాంబ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు పాల్గొని, శ్రీకాంతా చారి కి నివాళులు అర్పించారు. నల్గొండ జిల్లా అంటేనే విప్లవాల గడ్డ, ఆ గడ్డ మీద పుట్టిన పులి బిడ్డ శ్రీకాంతా చారి అని కొనియాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమం లో కీలక పాత్ర వహించిన కాసోజు శ్రీకాంతా చారి త్యాగం మరువలేదని. 2009నవంబర్29 న ఆ నాటి టి ఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆమరణ దీక్ష దీవాస్ కార్యక్రమం చేపట్టారు. ఆ దీక్ష కార్యక్రమం బగ్నం చేయడం తో అవన్నీ చూసి చలించిన శ్రీకాంతా చారి ఈ ఉద్యమం ఆగితే తెలంగాణ వస్తదో రాదో అని ప్రాణ త్యాగానికి సిద్దపడి ఎల్ బి నగర్ చౌరస్తా లో అంబేద్కర్ బొమ్మ వద్ద పెట్రోల్ పోసుకొని బగబగ మండే మంటల్లో ప్రాణత్యాగానికి సిద్ధ పడి అమరుడైన వ్యక్తి మన శ్రీకాంతా చారి. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను చేయడమే కాకుండా ఆ విద్యార్థి నాయుకుడు పేరును తెలంగాణ లో ఒక యూనివర్సిటీ కి పెట్టాలని బీసీ సంఘం తరుపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెండె చంద్ర శేఖర్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, పినపాక నియోజక వర్గ అద్యక్షులు నిదానపల్లి బాలకృష్ణ, భద్రాద్రి జిల్లా గౌడసంఘం అద్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సామాజిక న్యాయం జిల్లా అధ్యక్షులు కొడేబోయిన రవి, విశ్వబ్రాహ్మణ నాయకులు కృష్టమాచారి, మదవాచారి, కోటేశ్వరావు, జనార్దనాచారి, గోపాల కృష్ణ, భాస్కరా చారి, రంగు రామచంద్రయ్య అడ్వకేట్, ఉమామేశ్వరరావు, వీర భద్రచారి, బీసీ నాయకులు అముధాల వెంకన్న ముదిరాజ్, రవి తదతరులు పాల్గొన్నారు.