భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
వేమనపల్లి,డిసెంబర్ 03,(జనంసాక్షి)
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సహిత విద్య ఉపాధ్యాయుడు తోడే సమ్మయ్య ఆధ్వర్యంలో స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శనివారం నీల్వాయిలో ర్యాలీ నిర్వహించి,ఆటల పోటీలు నిర్వహించారు.అనంతరం దివ్యాంగ చిన్నారులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వేమనపల్లి జడ్పిటిసి రుద్రబట్ల స్వర్ణలత-సంతోష్ కుమార్ మాట్లాడుతూ మానసిక,శారీరక వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు.ప్రభుత్వం వీరి కోసం ఎన్నో సదుపాయాలు కల్పిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.భవిత కేంద్రంలో స్పీచ్, ఫిజియో థెరపి సేవలు అందించడంతో పాటు ఎక్సార్ట్,ట్రాన్స్పోర్టు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు.అనంతరం జెడ్పీటీసీ దంపతులు రుద్రభట్ల స్వర్ణలత-సంతోష్ కుమార్ ఐదు వేళ రూపాయాల విలువ గల టిఫిన్ బాక్సులు,వాటర్ బాటిల్స్,బుక్స్, పెన్నులు,పలకలు,ప్లేట్స్ పంపిణీ చేశారు.నీల్వాయి సర్పంచ్ గాలిమధు ఐదు వేల రూపాయల విలువ గల బీరువా ను భవిత కేంద్రానికి బహుమతిగా అందించారు.ఈకార్యక్రమంలో మండల విద్యాధికారి పోటు తిరుపతి రెడ్డి,నీల్వాయి ఎంపీటీసీ రుద్రబట్ల సంతోష్ కుమార్,సర్పంచ్ గాలిమధు,పిఎస్ హెచ్ఎం తలండి శంకర్,ఉప సర్పంచ్ నఫీజ బేగం,సిఆర్పీలు వెంకటేష్,అశోక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం




