Tuesday, 3 November 2026

బండి సంజయ్ పై పీస్ లో ఫిర్యాదు

 

 

 

 

 

– కఠిన చర్యలు తీసుకోవాలని మునిపల్లి మండల ప్రజాప్రతినిధులు డిమాండ్

 

మునిపల్లి, మార్చ్ 11, (జనంసాక్షి): భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై చర్యలు తీసుకోవాలని శనివారం నాడు మండలంలోని ప్రజాప్రతినిధులు మునిపల్లి పోలీస్​ స్టేషన్​లో ఎస్​ఐ రాజశేఖర్​కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్​, ఎంపీపీ శైలజ శివశంకర్​లు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అసభ్యకరంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసి ఒక ప్రత్యేక పాత్ర పోషించిన కవితపై, ఒక మహిళ అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో మహిళలకు ఏవిధంగా గౌరవిస్తారో ప్రజలు చూస్తున్నారన్నారు. సంజయ్ మాటలతో బీజేపీకి మహిళలపట్ల ఉన్న వైఖరి ఏంటో స్పష్టమైతోందన్నారు. సంజయ్ క్షమాపణలు చెప్పకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పిల్లోడి లక్ష్మీ నాగేష్, మునిపల్లి సర్పంచ్ రమేష్, చీలపల్లి సర్పంచ్ వీరన్న, పాటిల్, బోడపల్లి సర్పంచ్ బిందు రామకృష్ణ, గోపులారం సర్పంచ్ కీర్తి కుమారి, మునిపల్లి మండల బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.