ఘనంగా క్రిస్మస్ వేడుకలు
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నడుపబడుతున్న అన్ని బ్రాంచ్ లలో శనివారం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. పాఠశాలల పరిసరాలను క్రిస్మస్ ట్రీ లతో అందంగా అలంకరించి, పిల్లలతో వివిధ వేషధారణలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో విద్యాసంస్థల చైర్మైన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ మాట్లాడుతూ పాఠశాలల్లో అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రతి పండుగలను ఘనంగా నిర్వహిస్త, పండుగల ఔన్నత్యం గురించి పిల్లలకు తెలియచేస్తామని తెలిపారు. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తవక్కల్ విద్యాసంస్థలు ముందుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




