Saturday, 7 November 2026

ప్రమాదవశాత్తు నీటిలో పడి రైతు మృతి

ప్రమాదవశాత్తు నీటిలో పడి రైతు మృతి…
శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 24
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన పలుకల శంకర్ రెడ్డి అనే రైతు బ్రిడ్జి పై నుండి క్రింద నీటిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం. గద్దపాక గ్రామానికి చెందిన పలుకల శంకర్ రెడ్డి అనే రైతు సైకిల్ పై గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలో ఉన్న తన వ్యవసాయ భూమి వద్దకు వెళుతుండగా, మార్గమధ్యంలోని వాగు పై ఉన్న బ్రిడ్జి పైన ఉన్న పిల్లర్ పై కాలు పెట్టబోయి ప్రమాదవశాత్తు బోక్క బోర్ల పడడంతో తలకు బలమైన దెబ్బ తగిలి, శంకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రైతు శంకర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.