Saturday, 7 November 2026

నీటి సంఘం చైర్మన్,తెలుగుదేశం పార్టీ సీనియర్

నీటి సంఘం చైర్మన్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మినేని రాములు యాదవ్ ఆకస్మిక మృతి చెందటం బాధాకరం కొండమల్లేపల్లి డిసెంబర్ 24 జనం సాక్షి న్యూస్ : దేవరకొండ పట్టణానికి చెందిన ప్రముఖ సుపరిచితులు, పేద ప్రజల ఆశాజ్యోతి, ప్రజలందరూ ఆప్యాయంగా అభిమానించే, ఆత్మీయ నాయకుడు కొమ్మినేని రాములు యాదవ్(65) ఆకస్మికంగా మృతి చెందడం ఎంతో బాధాకరమని, నీటి సంఘం చైర్మన్ గా ఉంటూ దేవరకొండ పట్టణము అభివృద్ధి చెందడంలో కొమ్మినేని రాములు యాదవ్ ఎంతో కృషి చేశారని కొమ్మినేని రాములు యాదవ్ దేవరకొండ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశారని, తెలుగుదేశం పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి చివరి వరకు పార్టీలోనే ఉన్నారని, పార్టీ అభిమానంతోనే జీవితం గడిపారని కుటుంబ సభ్యులు తెలిపారు కొమ్మినేని రాములు యాదవ్ యాదవ సంఘం అధ్యక్షులుగా రెండు పర్యాయాలు చేశారని, తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షులుగా 20 సంవత్సరాలు చేశారని, శ్రీకృష్ణ దేవాలయ అధ్యక్షులుగా చేశారని తెలిపారు నీతి నిజాయితీగా ఉంటూ ప్రజలందరి ఆదరాభిమానాలు చురగున్న వ్యక్తి అని అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం ఎంతో బాధాకరమని పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ కొమ్మినేని రాములు యాదవ్ మృతి ఎంతో బాధాకరమని తెలిపారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు కొమ్మినేని రాములు యాదవ్ సంతాప కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గం లోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఇతర పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు తదితరులు కొమ్మినేని రాములు యాదవ్ మృతికి సంతాపం తెలిపారు