కొండమల్లేపల్లి మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు యుఐసి జేఏసి చైర్మన్ దేవరకొండ డివిజన్ సహోదరుడు వై సామ్యేల్
కొండమల్లేపల్లి డిసెంబర్ 25 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లేపల్లి మండల పరిధిలో ఆదివారం నాడు షిలోహు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కొండమల్లేపల్లి లోని షీలోహు చర్చి, పెళ్లిపాకల గ్రామంలో గల సీయోను చర్చి, చింతకుంట్ల గ్రామంలోని సినాయి చర్చి ల లో, మరియు ఇతర చర్చిలలో నేడు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయని యుఐసి జేఏసీ చైర్మన్ దేవరకొండ డివిజన్ సహోదరుడు వై సామ్యేల్ తెలిపారు భక్తులు నేడు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారని క్రీస్తు జన్మదిన సందర్భంగా సహోదరుడు వై సామ్యేల్ మాట్లడుతూ ఏసుక్రీస్తు లోక రక్షకుడుగా జన్మించాడని దానికి సాదృశ్యంగా ప్రజలందరూ ఈ రోజు జన్మదిన వేడుకను నిర్వహిస్తు ప్రార్థన నిర్వహిస్తున్నారని తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు కార్యక్రమాలలో మత పెద్దలు ఏసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి మనవాలి పాపమును తొలగించడానికి నేడు శరీరధారియై మానవ రూపంలో శాంతి సమాధానము ప్రజలందరికీ ఇవ్వడానికి లోక రక్షకుడు జన్మించాడని బోదించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు దేవకుమార్, సాంసన్, ఏలిష, క్రైస్తవ సోదరులు, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఘనంగా క్రిస్మస్ వేడుకలు యుఐసి జేఏసి చైర్మన్ దేవరకొండ డివిజన్ సహోదరుడు వై సామ్యేల్




