రామచంద్రరావు బంజర్ లో
సండ్ర చేతుల మీదుగా వస్త్రాల పంపిణీ
పెనుబల్లి, డిసెంబర్ 25(జనం సాక్షి) క్రిస్మస్ పర్వదినం సందర్భగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా ఆదివారం
పెనుబల్లి మండలం రామచంద్ర రావు బంజర్ గ్రామంలో సుమారు 80కుటుంబాలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఇమ్మడి సత్యనారాయణ కుమారుడు ఇమ్మడి వెంకటేశ్వరరావు తన సొంత ఖర్చులతో క్రిస్టమస్ సందర్భంగా ఈ వస్త్రాలను వితరణ గా ఇవ్వడం జరిగింది,కార్యక్రమంలో జెడ్ పి టి సి చెక్కిలాల మోహనరావు, స్థానిక నాయకులు కోమటి వెంకటేశ్వరరావు, యలమర్తి శ్రీనివాసరావు,కొలికిపోగు వెంకటేశ్వరరావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, చెక్కిలాల లక్ష్మణరావు, తావునాయక్,తదితరులు పాల్గొన్నారు.




