Wednesday, 4 November 2026

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

 

 

 

 

 

ఇటిక్యాల (జనంసాక్షి) జనవరి 26 : 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలో గురువారం ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్నేహ, తహసిల్దార్ కార్యాలయంలో తాహాసిల్దార్ సుబ్రహ్మణ్యం, ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో ఎస్సై గోకారి, కోదండాపురం సిఐ కార్యాలయంలో సిఐ సూర్య నాయక్, పదవ బెటాలియన్ లో కమాండెంట్ రామ్ ప్రకాష్, ఇటిక్యాల ఎమ్మార్సీ భవనంలో మండల విద్యాధికారి రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి వినోద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సింగల్ విండో చైర్మన్ రంగారెడ్డి, కస్తూర్బా గాంధీ పాఠశాల లో ప్రిన్సిపాల్, ఎర్రవల్లి గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ రఘు నాయక్ లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలోని ప్రాథమిక ఉన్నంత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎర్రవల్లి సరస్వతి స్కూల్, బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడి సెంటర్, గ్రామాలలో నూతనంగా వెలిసిన పల్లె దవాఖానలు, రైతు వేదికలలో జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచుకొని ఒకరికి ఒకరు గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవ, జడ్పిటిసి హనుమంత్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రధాన ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు,
అసిస్టెంట్ కమాండ్ అనిల్ శర్మ, ఆర్ఐలు రాజారావు, రాజేష్, శ్రీధర్, రమేష్ బాబు, గోపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.