Wednesday, 4 November 2026

జ్ఞానసరస్వతి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

 

 

 

 

 

 

ఇటిక్యాల (జనంసాక్షి) జనవరి 26 : మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో గురువారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకొని మండల కేంద్రంతోపాటు తిమ్మాపురం, యాక్తాపురము, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, జింకలపల్లి, ధర్మవరం, ఆర్ గార్లపాడు, కోదండాపురం, కొండేరు, వేముల, పెద్దదిన్నె, వల్లూరు, షాబాద్ గ్రామాల నుంచి బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. వివిధ గ్రామాల నుంచి సుమారు 200 మంది చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజ్ తెలిపారు. అలాగే సంగాల గ్రామానికి చెందిన చెట్టుకింది అయ్యపురెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మేనేజర్ తెలిపారు.