పెనుబల్లి, జనవరి 26 (జనంసాక్షి ) పెనుబల్లిమండలంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సంధర్భంగా ప్రభుత్వ కార్యాలయాలలో, పాటశాల, కళాశాలల్లో దేశ నాయకుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి జాతీయ జెండా ఎగురవే సి వేడుకలను ఘనంగా నిర్వహించారు,తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ లక్కినేనీ అలేఖ్య, ఎంపీడీఓ మహాలక్ష్మి, పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ .గుగులోత్ సూరజ్ తదితరులు జాతీయ జెండాలను ఎగురవేశారు.లింగగుడెం గ్రామపంచాయితీ గట్టుగుడెం ప్రాదమిక పాటశాలలో ఉపాధ్యాయులు మామిళ్ళ పళ్లి నాగేశ్వరావు జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.




