మెట్పల్లి, జనవరి 26, జనంసాక్షి :మెటుపల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెటుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఇల్లేందుల రాజు మాట్లాడుతూ ఈరోజు దేశ ప్రజలమైన మనమందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం, విద్య, వైద్యం అన్నీ మనకు మన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే పొందగలుగుతున్నామని. ఇంత గొప్ప దృఢమైన లిఖిత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఇంత గొప్ప రాజ్యాంగాన్ని భరత జాతికి అందించిన మహనీయుడు డా. అంబేద్కర్ దేశ ప్రజల హృదయాల్లో చిరకాలం ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, జగ్గాసాగర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రశాంత్, జైడి రవి, గంగాధర్, ఎండి ఉస్మాన్ భాయ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




