Wednesday, 4 November 2026

హాత్ సే హాత్ జోడో అభినయ్ యాత్రను ప్రారంభించిన :- డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి–27భువనగిరి యాదాద్రి జిల్లాకేంద్రంలో 74 వ గణతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. హాత్ సే హాత్ అభియాన్ జోడో యాత్రను సాయిబాబా గుడి నుండి యాత్రను కొనసాగిన యాత్ర వినాయక చౌరస్తా వద్ద అంబేద్కర్ కు పూలమాలవేసి ప్రిన్స్ చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలతో జగదేపూర్ చౌరస్తా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు హైదరాబాద్ చౌరస్తా వీరసవర్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర నుండి కాశ్మీర్ వరకు దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు .యాదాద్రి భువనగిరి జిల్లాలో పాదయాత్రకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టి పిసిసి రాష్ట్ర కార్యదర్శి ప్రమోద్ కుమార్ టి పి సి సి డెలిగేట్ మెంబర్ తంగాళ్ళపల్లి రవికుమార్ నక్కల ఆదినారాయణ సోమయ్య వెలగల రాజయ్య సత్యనారాయణ, చల్లగురుగుల రఘుబాబు, పిట్టల బాలరాజ్, బబ్లు నజీర్ నరేష్ అవేస్ చిస్తి , శీను నాగరాజు వెంకటేష్ జడ్పిటిసి పోరం కుడుగుల నగేష్ పి ఎస్ సి చైర్మన్ ఎమ్ఎల్ న్ రెడ్డి సంజీవరెడ్డి ,అయోధ్య రెడ్డి తడక వెంకటేశం నిరంజన్ రెడ్డి మండలాల జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచులు మండల నాయకులు కౌన్సిలర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఐ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు