Wednesday, 4 November 2026

విద్యార్థులను ఉత్సాహపరిచిన ఉద్యోగుల సంఘం

 

టేకులపల్లి, జనవరి 26( జనం సాక్షి): 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా బొమ్మనపల్లి ఉద్యోగుల సంఘం (బొమ్మనపల్లి ఐక్యత ) తరుపున జడ్పీహెచ్ఎస్ బొమ్మనపల్లి పాఠశాలలో 2021-22 సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పిల్లలకు మొదటి బహుమతిగా ఆకుల రంజిత్ కు 1116/- రెండొవ బహుమతి గా 516/- నగదు పారితోషికాన్ని విద్యార్థులకు అందించి ఉత్సాహపరిచారు. ఇలాంటి ప్రోత్సాహంతో విద్యార్థులు పోటీ తత్వంతో కష్టపడి చదువు పట్ల శ్రద్ధ చూపించే విధంగా ప్రోత్సహించడం అభినందనీయం. అదేవిధంగా ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల సమయంలో విద్యార్థులకు ఈ ఉద్యోగుల సంఘం తరఫున ఫ్యాడ్స్, పెన్సిల్స్, పెన్సు అందించడం హర్షనీయం. అదేవిధంగా ఇక్కడ ఐక్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేసిన వారిలో సంఘం ఉపాధ్యక్షులు వాంకుడోత్ హతీరామ్ నాయక్, రమేష్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం ఐక్య ఉద్యోగుల సంఘం నాయకులు జి రవి, ఎల్ రవి, వి సురేష్, ఎన్ బాలాజీ తదితరులు పాలుగోన్నారు.