Wednesday, 4 November 2026

ఘనంగా గణతంత్ర వేడుకలు..జాతీయ జెండాలను ఎగురవేసిన మంత్రులు

హైదరాబాద్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు పలు జిల్లాలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లి లోని తెలంగాణ భవన్‌లో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ గారు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్ గారు, సుడా చైర్మన్ జివి కృష్ణారావు గారు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, అరేపల్లి మోహన్ , కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.