ఘనంగా జాతీయ గణిత దినోత్సవం వేడుకలు
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (22): జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకొని మండల పరిధిలోని ఏదుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గురువారం జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అతి చిన్న వయసులోనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఫెలోషిప్ పొందిన అరుదైన మేధోసంపత్తి కలిగిన భారతీయుడని ఇతని మార్గంలో విద్యార్థులు అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతిని సమాజ ప్రగతిని ఆకాంక్షించే విధంగా విద్యార్థులు అభివృద్ధి చెందాలని వారన్నారు పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు రాధా సహకారంతో విద్యార్థులకు గణిత క్రీడలు, గణిత రంగోలి, గణిత ముగ్గుల పోటీ,గణితం క్విజ్ , కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేంద్ర చారి, కురుమన్న, దామోదర్ రెడ్డి, శ్రీనివాసులు, సీనయ్య, మురళి, శ్రీదేవి, గోపాల్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు




