ఇల్లందు జులై 3 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక జెకె కాలనీలోని శ్రీ హరి హర క్షేత్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్, ఇల్లందు డి.ఎస్.పి వెంకట రమణ మూర్తి పాల్గొని సాయినాధుని కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గురు పౌర్ణమి సందర్భంగా ఈ సోమవారంరోజు ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్ డి.ఎస్.పి వెంకట రమణ మూర్తి దంపతులు సాయి సేవలో పాల్గొని సాయినాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.స్వామివారి దర్శనానికి విచ్చేసిన హరిసింగ్ నాయక్,డి.ఎస్.పి వెంకట రమణ మూర్తి దంపతుల కి ఆలయ కమిటీ చైర్మన్ ఎల్ కృష్ణ ఆలయం తరఫున ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు.ఈ స్వామివారి సేవలో స్ధానిక 11 వ వార్డ్ కౌన్సిలర్ జెకె శ్రీను, టిఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల మద్ది రవి,ఇందిరా నగర్ వార్డ్ మెంబర్ నీలం రాజశేఖర్, సోషల్ మీడియా ఇంఛార్జి సత్తాల హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.. పూజలో పాల్గొన్న హార్సింగ్ నాయక్, డిఎస్పి వెంకటరమణమూర్తి




