గద్వాల నడిగడ్డ, జులై 3 (జనం సాక్షి);మున్నూరు కాపు కులస్తులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా, మండల కేంద్రాలలో విద్యార్థిని, విద్యార్థులకు వసతీగృహాలు భవన నిర్మాణల ఏర్పాటు కోసం ఎకరా భూమిని కేటాయించాలని కోరుతూ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారము జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శేషం నర్సింహులు, స్వామి సర్, అనంతరాములు, ఈశ్వరయ్య, భాస్కర్ రెడ్డి, పూడురు శ్యామ్,మురళి, అమర్, తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపు కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి




