ఆలేరు టౌన్ మే 8 (జనం సాక్షి )ఆలేరు పట్టణoలో డి.సి.సి.బి. చైర్మన్, టి.ఎస్.సి.ఏ.బి. వైస్ చైర్మన్ గింగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను బి.ఆర్.ఎస్. పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సోమవారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికకు భారీ ర్యాలీ తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆనందోత్సాహంతో టపాకాయలను కాల్చారు.అలేరు నియోజక వర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలతో పాటు నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి అనంతరం శాలువాలతో, మేమంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కానీ విని ఎరుగని రీతిలో జన్మదినం వేడుకను నిర్వహించి తనను ఆదరించిన తీరు హర్షణీయం అని అన్నారు.జన్మదినం లో పాల్గొని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఋణ పడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్,గ్రంధాలయ డైరెక్టర్ ఆడేపు బాలస్వామి,ఆర్.టి. ఏ. జిల్లా సభ్యులు పంతం కృష్ణ,మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ లు వస్పరీ శంకరయ్య,మోరిగాడి మాధవి వెంకటేష్,మాజీ సర్పంచులు చింతకింది మురళి,దాసి సంతోష్, కౌన్సిలర్లు బెతి రాములు,మోర్తాల సునీత రమణా రెడ్డి,పీ.ఏ.సి.ఎస్. చైర్మన్,మోగులగాని మల్లేష్ గౌడ్,బి.ఆర్.ఎస్. పట్టణ కోశాధికారి చింతకింది మురహారి, పత్తి వెంకటేష్, పొరెడ్డి శ్రీనివాస్,జల్లి నర్సింహులు,సీసా మహేశ్వరి, క్యసాగల్ల అనసూయ, అలేటి అనీల్,ముదిగొండ శ్రీకాంత్,పార్టీ శ్రేణులు,ప్రజలు భారీ ఎత్తుగా పాల్గొన్నారు.




