Wednesday, 4 November 2026

సిపిఐ ప్రజా పోరు యాత్ర.

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 20, (జనంసాక్షి )బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలంలో ప్రజా పోరు యాత్ర గురువారం నాటికీ మూడవ రోజుకు చేరుకుంది. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మేకల దాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగం రవి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ కు పూల మాలలు వేసి యాత్ర ప్రారంభించారు. ఈసందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు సిపిఐ ఇంటింటి ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తూ ప్రజలను కలుస్తూ కేంద్రంలో, రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బెల్లంపల్లి నియోజకవర్గంలో గోదావరి నీరు అందించాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్నా రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరణ చేయకూడదని తదితర విషయాలపై ఈ ప్రజాపోరు యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో దళ సభ్యులు దాగం మల్లేష్, సాలిగామ సంతోష్, గుండ చంద్ర మాణిక్యం, బియ్యల ఉపేందర్, అందె పురుషోత్తం, కామెర మల్లయ్య, భరత్ పాల్గొన్నారు.