ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

రఘునాథ పాలెం సెప్టెంబర్ 26(జనం సాక్షి)

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఖమ్మంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకరి విముక్తి కోసం దేశముక్ లకు ఉద్యమించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అణచివేత అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని లింగాల పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిండిప్రోలు రామ్మూర్తి వెంకటరమణ ఎర్ర గంగాధర్ తదితర నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు