చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు మున్సిపల్ చైర్మన్- మోర హన్మండ్లు

సెప్టెంబర్ 26 (జనంసాక్షి).
చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు.
మంగళవారం స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అవరణలో గల చాకలి అయిలమ్మ విగ్రహం ఆవరణలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 128 వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన చైర్మన్ మోర హాన్మండ్లు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని , తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,మహేష్ గౌడ్,రజక సంఘం సభ్యులు కొడిమ్యాల భూమయ్య, బండపల్లి గంగాధర్, మామిడి రాజు, కొడిమ్యాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.