Wednesday, 4 November 2026

ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు.

బూర్గుంపహాడ్ సెప్టెంబర్ 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక మేజర్ గ్రామం పంచాయతీ బస్టాండ్ సెంటర్లో రజక సంఘం బీసీ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం మండల అధ్యక్షులు దాసరి సాంబ మాట్లాడుతూ ఐలమ్మ యొక్క తెగువ పట్టుదల ఆనాడు చేసిన పోరాటం గురించి చాలా గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి రజక నాయకులు చీమలపాటి కోటేశ్వరరావు, గడ్డం రవి, ఘంటసాల శ్రీనివాసరావు, నరేష్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు దాసరి సాంబ, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకా చారి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కేశగాని శ్రీనివాస్ గౌడ్, సీనియర్ రజక నాయకులు కొక్కిరేణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.