Wednesday, 4 November 2026

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు…

 

 

 

 

శంకరపట్నం: జనం సాక్షి ఏప్రిల్ 5భారత మాజీ ఉప ప్రధాని దివంగత మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను బుధవారం శంకరపట్నం మండలం పరిషత్ కార్యాలయంలో కల్వల , మొలంగూర్, కన్నాపూర్, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన దేశ బడుగు బలహీన వర్గాలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు ఉమ్మెoతల సరోజన, వైస్ ఎంపీపీ పులి కోట రమేష్, తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు, ఎంపీడీవో ఎండి ఖాజా బషిరోద్దిన్, ఎంపీటీసీలు బొజ్జ కవితా కోటిలింగం, మోతే భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, సర్పంచులు కొండ్ర రాజయ్య దాసారపు భద్రయ్య, మొ కిరాల కిషన్ రావు, కాటం వెంకట రమణారెడ్డి, మోరే అనుష శ్రీనివాస్ ,కొత్తగట్టు మచ్చ గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ సాగి మలహల్ రావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, ఆర్ ఐ లక్ష్మారెడ్డి, వివిధ రాజకీయ, ఉమ్మెoతల సతీష్ రెడ్డి ,బండారి తిరుపతి, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రవి, ఆలిండియా అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు, రాజ్ కుమార్ ,మహేష్, తదితరులు పాల్గొన్నారు.