Tuesday, 3 November 2026

చీటింగ్ కేసులో ఒకరు అరెస్టు…14 రోజుల రిమాండ్

 

 

 

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 5 (జనంసాక్షి)రాజంపేట్ పోలీస్ స్టేషన్ లో జనవరి నెలలో సిలివెరి శ్రీశైలం పిర్యాదు మేరకు తనతో పాటుగా రాజంపేట్ గ్రామానికి చెందిన కొంతమంది ఆటో డ్రైవర్లుకి మలేసియా లో పని ఉందని విసా కల్పిస్తామని పిర్జాడిగుడ హైదరాబాద్ చెందిన అల్లిమినటి శ్వేతా రెడ్డి డబ్బులు తీసుకొని వీసాలు ఇవ్వకుండా, తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేయగ దీనిపై రాజంపేట్ పోలీస్ స్టేషన్ నందు  చీటింగ్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేసిన అనంతరం నిందితురాలు అయిన ఆల్లిమినటి శ్వేతారెడ్డినీ బుధవారం అరెస్ట్ చేసి కామారెడ్డి కోర్టు లో హాజరు పర్చగ జడ్జి గారు నిందితురాలు నీ 14 రోజులు రిమాండ్ నిమిత్తం జైల్ కి పంపడం జరిగింది, అదే విధంగా నిన్నటి రోజు రాజంపేట్ పోలీస్ స్టేషన్ లో విధులలో ఉన్న పోలీస్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి, విధులకి అటంకంపర్చిన వారిపై కేస్ నమోదు చేయడం జరిగింది.