Thursday, 5 November 2026

ఘనంగా జన్మదిన వేడుకలు

కాప్రా, నవంబర్‌ (జనంసాక్షి)

ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పావనిమణిపాల్‌రెడ్డి జన్మదినవేడుకలు ఆదివారం తన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అనేకమంది పెద్దసంఖ్యలో హాజరయ్యారు. శాలువాలతో సన్మానించి, బోకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సర్కిల్‌ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు హాజరై, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు పాండాల శివకుమార్‌గౌడ్‌, నాగిళ్ళ బాల్‌రెడ్డి, అనిల్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.