Friday, 6 November 2026

దేశ రాజకీయాల్లో బి ఆర్ ఎస్ పార్టీ కీలక పాత్ర కుంభం శ్రీనివాస్ గౌడ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు

దేశ రాజకీయాల్లో బి ఆర్ ఎస్ పార్టీ కీలక పాత్ర కుంభం శ్రీనివాస్ గౌడ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు
కొండమల్లేపల్లి డిసెంబర్ 09 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బి.ఆర్.ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారిన సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు పాటుగా సుదీర్ఘ పోరాటం చేసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు ఆయన నాయకత్వంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినందుకు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం జరిగిందని అని తెలిపారు కేసీఆర్ నాయకత్వంలో భారత దేశ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల దీవెనలు పొందిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రత్యేకంగా రైతుల కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని స్వాతంత్రం వచ్చాక తెలంగాణలో ఇంత అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు భారతదేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలలో విస్తరించాలని కెసిఆర్ సేవలు దేశ ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాను అని బిఆర్ఎస్ పార్టీ మరెన్నో విజయాలు సాధించాలని ఒక ప్రకటనలో తెలిపారు