Tuesday, 3 November 2026

ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, జనవరి 30,జనంసాక్షి :
మెటుపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మగాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీప ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అహింసే మార్గంగా దేశాన్ని ఒక్కథాటిమీదకు తీసుకొచ్చి దేశాన్ని బానిస సంకెళ్ల నుండి విముక్తి కలిగించిన మహాత్మున్ని ఈరోజు స్మరించుకోవడం భారతీయులుగా మనందరి బాధ్యత అన్నారు స్వాతంత్రోద్యమంలో మహాత్ముడి పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మెటుపల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందె భవితారాణి, మండల,మెట్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు ఇల్లేందుల రాజు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చెన్నూరి నిర్మల, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.బెజ్జారపు శ్రీనివాస్,సీనియర్ నాయకులు అందె మారుతి బాపూజీ,షకీల్,యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నూరి శివ,కోటగిరి చైతన్య,రవి,గంగాధర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.