వెంకటరావు పల్లి లో బీజేపీ అధ్వర్యంలో సెస్ ఎన్నికల ఇంటింటి ప్రచారం
బోయిన్ పల్లి డిసెంబర్ 22 (జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం సెస్ డైరెక్టర్ గా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి జోగు రవీందర్ కు మద్దతుగా వెంకట్రావు పల్లె గ్రామంలో మండల ఉపాధ్యక్షులు పాలోజు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలారెడ్డి హాజరై గ్రామంలో ఎన్నికల ఓట్లు వేసే ఓటర్ల ఇంటింటికి తిరుగుతూ బ్యాలెట్ పేపరు నమూనాను పంపిణీ చేస్తూ టార్చ్ గుర్తుపైన ఓటు వేయాలని అభ్యర్థించారు జాడి బాలారెడ్డి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు వివిధ వృత్తుల వారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా బిజెపి అభ్యర్థి టార్చ్ లైట్ గుర్తుపైన ఓటు వేయాలని అన్నారు నీలోజుపల్లె ఉపసర్పంచ్ జిల్లా కార్యవర్గ సభ్యులు చెంచు నాగరాజు మండల ఉపాధ్యక్షులు ఇల్లందుల బాలయ్య సుధాకర్ పటేల్ జోన్ బీజేవైఎం అధ్యక్షులు పొన్నాల రాము జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు నాగుల వెంకటేష్ గౌడ్ కొత్తపల్లి మండల ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బండారి శ్రావణ్ కుమార్ రాజు నరేష్ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
వెంకటరావు పల్లి లో బీజేపీ అధ్వర్యంలో సెస్ ఎన్నికల ఇంటింటి ప్రచారం




