భైంసా రూరల్ జనవరి 24 జనం సాక్షినిర్మల్ జిల్లా బైంసా డిపో ఎదుట పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సుల్లో నుంచి గతంలో ప్రైవేట్ డ్రైవర్ గా పని చేసిన ఒకతను సోమవారం రాత్రి డీజిల్ తీస్తున్న క్రమంలో డ్యూటీలో ఉన్న డ్రైవర్లకు పట్టుబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆదివారం డిపో ఎదుట పార్కు చేసిన ఓ బస్సులో నుంచి ఓ అపరిచిత దొంగ డీజిల్ పూర్తిగా తొలగించగా… ఉదయం బస్సు డ్రైవర్ వచ్చి బస్సు స్టార్ట్ చేయగా బస్సు స్టార్ట్ అవడం లేదు ఎంతకీ గమనించినా ప్రాబ్లం అర్థం కాలేదు దీంతో గమనించిన మెకానిక్ బస్ డీజిల్ ట్యాంకులో డీజిల్ పూర్తిగా లేదంటూ గుర్తించారు. సోమవారం కూడా అదే సీన్ రిపీట్ అవుతుందనే సమయానికి డ్యూటీలో ఉన్న డ్రైవర్స్ గట్టిగా వస్తున్నా శబ్దాన్ని గమనించి ఆగి ఉన్న బస్సుల వెనుక వెళ్లి చూడగా దొంగ బస్సులో నుంచి డీజిల్ దొంగ చేసే క్రమంలో సిద్ధమయ్యాడు. వెంటనే గమనించిన డ్రైవర్స్ పట్టుకొని పోలీస్ లకి ఫిర్యాదు చేశారు. నిందితుని వద్ద డీజిల్ ట్యాంక్ ను ఇప్పె పలు రకాల ఇంప వస్తువులు,దొంగ చేసిన డీజిల్ నింపడానికి పెద్ద డిజిల్ క్యాన్ లభ్యమయ్యాయి. పోలీసులు వెంటనే దొంగని తీసుకెళ్లి ఆదివారం,సోమవారం రాత్రిలలో వచ్చిన దొంగ ఒక్కరేనా అని దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. భైంసా బస్సు డిపో ఎదుట ఇలా ప్రైవేటు బస్సులు నిలపడం అంత మంచిది కాదని,అక్కడి వరకు వచ్చిన దొంగ డిపోలోకి ప్రవేశిస్తే ఎలా అని పలువురువాపోన్నారు. సంబంధిత డీఎం అధికారిని ప్రైవేటు వాహనాలు అక్కడ నిలపకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.




