కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 11 :-. కుల వివక్షత పై అలుపెరుగని పోరాటం చేసిన మహా యోధుడు అనగారిన వర్గాల ప్రజలను విద్యావంతులను చేసేందుకోసం జీవితాన్ని ధారపోసిన మహానీయుడు జ్యోతిరావు పూలే 196వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామలింగం అన్నారు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో మేయర్ కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా కార్పొరేటర్ లు కోఆప్షన్ సభ్యులు నాయకులు కార్పొరేషన్ సిబ్బందితో కలిసి కమిషనర్ రామలింగం జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం సమాజంలో నెలకొన్న అంటరానితనం అసమాన తలపై నిరంతర పోరాటం చేశారని ప్రజలందరూ చదువుకుంటేనే సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఆస్కారం ఉంటుందని తలచి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఆయన గణ కీర్తిని కొనియాడారు ఆ మహనీయుడిని గౌరవించుకోవడం మన కనీస బాధ్యతగా గుర్తించి ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు




