మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 11డైట్ కళాశాల భూమిని ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారనే కుట్రను అడ్డుకోవాలని ఎబివిపి నాయకులు విద్యార్థులతో కలిసి డైట్ కాలేజి ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.డైట్ కళాశాల భూమిని విద్యార్థులు ఏకమై పరిరక్షించుకోవాలాని పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కన్వీనర్ అఖిల్ మాట్లాడుతూ.డైట్ కళాశాల భూమి విద్యార్థుల సొంతమని విద్యాశాఖ కు చెందిన భూమి వేరే శాఖకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు.మల్కాజిగిరి లో ఉన్నటువంటి డైట్ కాలేజీని వేరే అవసరాల కోసం కేటాయిస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.డైట్ కళాశాలకు సంబంధించిన పది ఎకరాల భూమి ఉంటేనే ఎన్‌సిటిఇ అనుమతి ఇస్తుందని.ఒకవేళ డైట్ కళాశాలను వేరే దగ్గరికి మార్చితే డైట్ కళాశాల అనుమతి రద్దు చేసే అవకాశం ఉందని డైట్ కళాశాలను మూసివేసే కుట్రలో భాగంగానే వేరే అవసరాల కోసం భూమిని కేటాయించారని ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి పునః పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు.కోర్టుకు కావాలంటే వేరే చోట స్థలాన్ని కేటాయించాలని డైట్ కళాశాల భూమిని అలాగే కొనసాగించాలని లేనియెడల రాబోయే రోజుల్లో ఏబీవీపీఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్,డైట్ కళాశాల విద్యార్థులు వెంకటేష్, స్రవంతి,విపుల్,భాను,సచిన్,అవినాష్, శశాంక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




