.మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్11 ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా జీవితకాలం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిబాపూలే అని గౌతం నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అన్నారు.మహాత్మా జ్యోతి బాపులే 197వ జయంతి సందర్భంగా పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.సంఘ సంస్కర్త,సామాజిక తత్వ వేత్తగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ధీరశాలి, బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి, జ్యోతి బాపులె ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో మేకల రాము యాదవ్,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,కాలనీ వాసులు పాల్గొన్నారు.




