Wednesday, 4 November 2026

బిచ్కుందలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

 

 

 

 

 

 

బిచ్కుంద ఏప్రిల్ 11 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపీపీ అశోక్ పటేల్ నాల్చర్ రాజు అధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన తెలిపిన బాటలో నడవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ రాజు, సిద్ధిరాం పటేల్, మాజీ జెడ్పిటిసి సభ్యుడు సంది సాయిరాం, మాజీ ఎండోమెంట్ చైర్మన్ బొమ్మల లక్ష్మణ్, సాయిని బస్వరాజ్, మిషన్ కల్లాలి సర్పంచ్ సంజు పటేల్,    చిన్న దడ్గి సర్పంచ్ విట్టల్ రెడ్డి, మేదరి బాలరాజ్, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.