బిచ్కుంద ఏప్రిల్ 11 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో రేపు అనగా బుధవారం ఉదయం 11 గంటలకు మార్కెట్ కార్యాలయంలో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి ఆత్మీయ సన్మానము కలదని మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే వస్తున్నారని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల పార్టీ అనుబంధ సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు రావాలని ఆయన కోరారు.




