వాలీబాల్ పోటీలను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య టేకులపల్లి, మార్చి 29 (జనం సాక్షి ): మండలంలోని బోడు గ్రామంలో సీపీఐ యం.ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ప్రారంభించారు.న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు ఆధ్వర్యంలో బోడు, కొమరారం లను మండల కేంద్రాలుగా ప్రకటించాలని కోరుతూ గత నెల రోజులుగా చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నుండి బోడు గ్రామంలో వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడాకారులను పరిచయ కార్యక్రమం అనంతరం క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారివెంట నాయకులు కోరం సురేందర్,ఈది గణేష్,భూక్యా సర్దార్,చందర్ సింగ్ రాథోడ్,బానోత్ రవి,రావూరి సతీష్,సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నియోజకవర్గ నాయకులు తుపాకుల నాగేశ్వరరావు,కల్తీ వెంకటేశ్వర్లు,మండల గ్రామస్థాయి కమిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీలను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య




