జనం సాక్షి/ కొల్చారం మండల వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి పరిస్థితిని మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మండల కేంద్రమైన కొల్చారంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని సర్పంచ్ కరంట్ ఉమాదేవి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పోతంశెట్టిపల్లి సర్పంచ్ గడ్డమీది నాగరాణి నరసింహులు గ్రామపంచాయతీ సెక్రెటరీ అరుంధతి. దళిత సంఘం నేత జలగం దుర్గయ్య, సంగాయిపేట లో సర్పంచ్ మానస శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్, రంగంపేట లో బండి సుజాత రమేష్, దళిత సంఘం నాయకులు దుర్గేష్, సురేష్, జైపాల్, ఎనగండ్లలో ఎం పి పి మంజుల కాశీనాథ్, సర్పంచ్ వీరారెడ్డి, పైతరలో సర్పంచ్ సంతోష ఎల్లేశం, కిష్టాపూర్ లో సర్పంచ్ గోదావరి, వరిగంతంలో జెడ్పి్టిసి మేఘమాల సంతోష్ , కోనాపూర్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ఆయా గ్రామాల సర్పంచులు, దళిత సంఘాల నేతలు, యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నఘన్పూర్లో అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ బొబ్బిలి ఇందిరా ప్రియదర్శిని సందీప్ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, సి డి సి మాజి ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సందర్బంగా ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడని, ఆయన అడుగు జాడల్లో నడవాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి నప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, వడ్ల లక్ష్మీపతి, బాగారెడ్డి, పులెబోయిన మల్లేష్, సోమ నర్సింలు, మంద నాగులు, మధుసూదన్ రెడ్డి, కమ్మరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరిగుంతంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.




