Thursday, 5 November 2026

ఘనంగా భారత రత్న బిఆర్ అంబేడ్కర్ జయంతి

 

 

 

 

 

 

 

టేకులపల్లి,  ఏప్రిల్ 14( జనం సాక్షి): విశ్వవిజ్ఞాని, రాజ్యాంగ రూపశిల్పి,భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని టేకులపల్లి మండలంలో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పిస్తూ ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, సులానగర్ లో, గోల్యా తండాలో గల అంబేద్కర్ విగ్రహానికి  శుక్రవారం 132 వ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ,సామాజిక, ప్రజాసంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ,సమానత్వం, ప్రజాస్వామ్యం,సామాజిక న్యాయంతో ఆర్థిక అసమానతలు లేని భారత దేశం పరితపించిన గొప్ప దర్శినికుడు అంబేడ్కర్ ఆలోచనలు విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాయన్నారు.కులవివక్షత,అంటరానితనం నిర్ములనకు అంబేడ్కర్ చేసిన కృషి దళిత వర్గాలకు వరమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం  కనకయ్య, ఎంపీపీ భూక్య రాధా,బేతంపూడి  సొసైటీ అధ్యక్షులు  లక్కినేని సురేందర్ రావు, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, సర్పంచులు అజ్మీర బుజ్జి , బోడ నిరోషా, పూనెం ఉమా, ఎంపీటీసీ బానోతు సరోజ , బిఆర్ఎస్ నాయకులు, పి ఆర్  కాలే, మాలప్రోలు జయరాజు, బల్లెం బిక్షం, కుమ్మరి చౌదరి, గుండా రవీందర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య దేవా నాయక్ , రాసమల్ల నరసయ్య, ఉండేటి దేవరాజు, బానోతు లకుపతి, బానోతు సరిలాల్, సొసైటీ సీఈఓ పొల్లోజు ప్రేమ చారి, మోకాళ్ళ పోశాలు, ఈది గణేష్, ఇస్లావత్ రెడ్డి నాయక్, మధు రెడ్డి, బోడ మంగీలాల్ నాయక్, బానోత్ బద్రు, బిజెపి నాయకులు ధారావత్ బాలాజీ నాయక్, వాంకుడోత్ హాతిరాం నాయక్  తదితరులు పాల్గొన్నారు.