Thursday, 5 November 2026

పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన బిఆర్ఎస్ సులానగర్  యూత్ నాయకులు

 

 

 

టేకులపల్లి, ఏప్రిల్ 14( జనం సాక్షి): భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా బిఆర్ఎస్  సులానగర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం సులానగర్ గ్రామంలో ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల సురేష్ బాబు, బల్లెం బిక్షం, కుమ్మరి చౌదరి, కాలే వంశీ, బల్లెం సుధాకర్, కాలే సుందరయ్య, జంగం ఎలీషా ,మాలప్రోలు రవి, కుమ్మరి కిరణ్, కొట్టే సురేష్, బల్లెం దాసు బాబు, కర్లపూడి అనిల్, హాస్పిటల్ సిబ్బంది రమేష్ బాబు, అరుణకుమారి, అరుణ, సుజాత, అనసూర్య పాల్గొన్నారు.