ఏప్రిల్ 14 (జనంసాక్షి)ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు,అనంతరం వారు మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత ,అణగారిన వర్గాల పక్షాణ నిలిసిన మహనీయుడు అని అన్నారు, భారత రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యక్తి అని ఆ రాజ్యాంగమే ప్రపంచంలోనే అత్యున్నతమైనదని కొనియాడారు,ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘనాయకులు నర్సయ్య,హన్మయ్య,రాజు,మల్లయ్య,రాజయ్య,మాజీ సర్పంచ్ లు అంజయ్య,మల్లయ్య,రాజమల్లయ్య,నాయకులు తిరుపతి,అల్లయ్య,నర్సయ్య,డా,వెంకటేశం, వి,కర్ణ,తిరుపతి,పోచయ్య, రఘుపతి,అనిల్,అంజి,బాబు,శేఖర్,శంకరయ్య, కిరణ్,నగేష్,రమేష్,రాజారాం, రాజేష్,రాములు,మల్లేష్ ,నర్సయ్య,తదితరులు ఉన్నారు.




