Thursday, 5 November 2026

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

 

 

 

 

 

వేమనపల్లి,ఏప్రిల్ 14,(జనంసాక్షి):వేమనపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం,వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల ఆవరణలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి ఎనలేని సేవలందించి,బడుగు బలహీన వర్గాల అభ్యన్నతికోసం నిరంతరం పాటుపడ్డారని కొనియాడారు.ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహౌన్నత వ్యక్తి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అల్లూరి  లక్ష్మయ్య, కో ఆప్షన్ సభ్యులు జాహెద్ అలీ,సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.