జుక్కల్, ఎప్రిల్ 14, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కేంద్రంలో ని అంబెద్కర్ చౌరస్తాలో శుక్రవారం అంబెద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబెద్కర్జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
అంబెద్కర్ విగ్రహానికి నాయకులు,యువకులు, మహిళలు, ప్రజా ప్రతినిదులు,అంబెద్కర్ యువజన సంఘం సభ్యులు, దళిత సంఘాల నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళలు అంబెద్కర్ ను స్మరిస్తూ పాటలుపాడారు.అంబెద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కాంబ్లే కిషన్ నాయకులకు శాలువాలు ,పూలమాలలతో సన్మానించారు.స్ధానిక సర్పంచ్ బి.రాములు,ఉప సర్పంచ్ భానుగౌడ్,సింగిల్ విండో ఛైర్మన్ ఎన్. శివానంద్,కాంగ్రెస్ మండల అద్య క్షులు దాదారావ్ పాటిల్, బి ఆర్ఎస్ నేతలు మాధవరావ్ దేశాయ్,నీలుపాటిల్, సాయాగౌడ్, బొల్లి గంగాధర్,యూ.శంకర్,శివాజీ పాటిల్,గోటికె రాజు, కాంగ్రెస్ యువ నాయకులు వస్రె రమేష్,బిజెపి నాయకులు ప్రశాంత్ పాటిల్,ఏఎస్ఐ పోల రమేష్,రెడ్ క్రాస్ చైర్మన్ ఉమాకాంత్,కృష్ణ గౌడ్, తుకారాం, ఎన్. రాజు,కపిల్,రమేష్,విట్ఠల్ తదితరులు పాల్గొన్నారు.




