Thursday, 5 November 2026

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

 

 

 

 

 

ఇటిక్యాల (జనంసాక్షి) ఎప్రిల్ 14 : మండల పరిధిలోని బీచుపల్లి పదవ బెటాలియంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని బెటాలియన్ కమాండెంట్ బి రాంప్రకాష్ ఆధ్వరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో ఎన్నో అవమానాలు, అసమానతలను ఎదుర్కొని భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్పప్రపంచ మేధావుని కొనియాడారు. అదేవిధంగా కొండేరు గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ అలంపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మందా శ్రీనాథ్ స్వగృహంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎర్రవల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ జోగుల రవి ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొండేరు ఎంపీటీసీ వీరన్న, మాజీ ఎంపీటీసీ శేషన్ గౌడ్, బెటాలియన్ అడిషనల్ కమాండెంట్లు సాంబశివరావు, నాగనాయక్, అనిల్ కుమార్, ఆర్ఐలు రాజేష్, రాజారావు, రమేష్ బాబు, శ్రీధర్ తదితర సిబ్బంది ఉన్నారు.