Thursday, 5 November 2026

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి

పెద్దవంగర డిసెంబర్ 06(జనంసాక్షి)రాజ్యాంగ నిర్మాత విశ్వ విజ్ఞాని భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటరానితనం, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసారని కొనియాడారు. ఆర్ధిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ, ఎస్టీ, బి సి లు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం తుదిశ్వాస వరకు ఆయన పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెనక దాసుల లక్ష్మి, స్థానిక ఎంపిటిసి ఎదునూరి శ్రీనివాస్, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ఆర్కే తండా సర్పంచ్ జగ్గు నాయక్,బోనగిరి లింగమూర్తి, చిలుక బిక్షపతి,రంపక కిరణ్,ఐలయ్య ముత్యాల పూర్ణచందర్,అనపురం శ్రీనివాస్,బానోత్ సీతారాములు,సుంకరి అంజయ్య, చిలుక సిద్దు, మల్లేష్,చెరుకు యాకయ్య బోనం యాకయ్య, జాటోత్ వెంకన్న, దంతలపల్లి ఉపేందర్,చిలుక వెంకన్న, మహేష్, సంజీవ, తదితరులు పాలుగోన్నారు