Thursday, 5 November 2026

డాక్టర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలి

డాక్టర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలి
* కోయగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అమర్ సింగ్

టేకులపల్లి, డిసెంబర్ 6( జనం సాక్షి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక విద్యార్థి ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోయగూడెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి అమర్ సింగ్ అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా పాఠశాలలో అంబేద్కర్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు బి.అమర్ సింగ్,స్టాఫ్ సెక్రటరీ ఈ.ముత్తయ్య ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు,ఉపాధ్యాయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలను అధిరోహించాలని,కుల మతాలకు అతీతంగా అందరూ భిన్నత్వంలో ఏకత్వంతో మెలిగి వారి ఆశయాలను సాధించాలని, మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, సైదులు, శారద,పాపారావు,శ్రీనివాస్,నాగేశ్వరరావు, కస్నా,హరిలాల్,యం.శ్రీనివాస్,వీరన్న,జానకి,బాలాజీ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.