Thursday, 5 November 2026

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు

వేమనపల్లి,డిసెంబర్06,(జనంసాక్షి):

ప్రపంచ మేధావి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి నీల్వాయి ఎంపిటిసి రుద్రబట్ల సంతోష్ కుమార్,సర్పంచ్ గాలిమధు,ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ చెన్నూరు సమ్మయ్య మాదిగ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రముఖ న్యాయవాది, శాస్త్రవేత్త,కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి,భారత రాజ్యాంగ శిల్పి,బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఈకార్యక్రమంలో
మాలిసంఘం మండల అధ్యక్షుడు నెండుగురి మధుసూధన్,యాదవ సంఘం మండల అధ్యక్షుడు కాయిత తిరుపతి,పద్మశాలి సంఘం అధ్యక్షుడు కోడూరి దుర్గయ్య,నాయిబ్రహ్మన మండల అధ్యక్షలు శ్రీరాముల రమేష్, నాయకులు అవులమారీ పున్నం,మంత్రి రమేష్, గోర్క పోషన్న,ఇగురం జగన్,కుమ్మరి శ్రీనివాస్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.