ప్రభుత్వ పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి రెండు జతల దుస్తుల పంపిణి*
మెట్పల్లి, డిసెంబర్ 06
జనంసాక్షి :
మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజున విద్యార్థులకు ఒక్కోక్కరికి రెండు జతల సమ దుస్తులు (యూనిఫామ్) పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా
సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ…
ప్రతి సంవత్సరం లాగే తెలంగాణ ప్రభుత్వం రెండు జతల కుట్టబడిన నాణ్యమైన సమ దుస్తులు (యూనిఫామ్ ) ప్రభుత్వ పాఠశాలలో పంపిణి దృష్ట్యా పేద విద్యార్థులలో సమభావం, క్రమశిక్షణ, ఐక్యమత్యం పెంపొందించే కృషి చేస్తుంది అని తెలిపారు.. యూనిఫామ్ విధిగా వేసుకుని పాఠశాలకు రావాలి అని, క్రమశిక్షణ గా ఉంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు సరిగా అబ్బుతాయ్ అని తెలిపారు ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ విజయ్,టీచర్స్ సతీష్, లక్ష్మి, పెద్దమనుషులు రాజేందర్, మైసరెడ్డి, విద్యా వాలంటీర్ లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి రెండు జతల దుస్తుల పంపిణి




